మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్
QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు
నకిలీ మీడియా పాస్‌లకు చెక్..
నెల్లూరు క్రైమ్, ఆగస్టు 08, (సీమకిరణం న్యూస్):
మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను ప్రారంభించారు. ప్రత్యేక QR కోడ్ డిజిటల్ పాస్ ద్వారా జర్నలిస్టుల వివరాలను క్షణాల్లో ధృవీకరించే సదుపాయం కల్పించారు. దీంతో నకిలీ మీడియా పాస్‌లకు అడ్డుకట్ట పడనుంది. మీడియా మిత్రుల అభ్యర్థన మేరకు సోమవారం కూడా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో QR కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. ఇదే తరహా స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ విధానాన్ని త్వరలోనే తిరుపతిలోనూ ప్రారంభించనున్నట్లు సమాచారం.

