Saturday, July 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఆత్మహత్యకు యత్నించిన ఎంబీఏ విద్యార్థిని .. కాపాడిన కర్నూలు 4వ పట్టణ పోలీసులు

ఆత్మహత్యకు యత్నించిన ఎంబీఏ విద్యార్థిని .. కాపాడిన కర్నూలు 4వ పట్టణ పోలీసులు

📰 Generate e-Paper Clip

ఆత్మహత్యకు యత్నించిన ఎంబీఏ విద్యార్థిని

 

 

సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు

 

 

విద్యార్థినిని ప్రాణాలతో కాపాడిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు

 

 

కర్నూలు క్రైమ్, జూలై 19, (సీమకిరణం న్యూస్) :

 

పెళ్లి ఇష్టం లేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన ఓ ఎంబీఏ విద్యార్థినిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలతో కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం, నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన నాగశంకర్, విజయకుమారి దంపతుల కుమార్తె సుదర్శనమ్మ (24) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. అనంతరం కర్నూలులోని పోలీస్ కాలనీలో నివసిస్తున్న తన తాత బూరుగుల సత్యరాజు వద్ద పెరిగి, ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల కుటుంబ సభ్యులు ఆమెకు వివాహ సంబంధాలు చూడగా, ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని సుదర్శనమ్మ చెబుతూ వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం పెళ్లిచూపులకు కొందరు వస్తున్నారని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో వాగ్వాదం అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయింది.

 

టవర్ లోకేషన్‌తో గుర్తించిన పోలీసులు

 

మనవరాలు కనిపించకపోవడంతో తాత సత్యరాజు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ విక్రమ సింహ ఆదేశాల మేరకు సెక్టార్ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థిని మొబైల్ టవర్ లోకేషన్‌ను గుర్తించారు. ఆమె ఎన్‌హెచ్-44 పంచలింగాల సమీపంలోని తుంగభద్ర నది బ్రిడ్జి కింద గంగమ్మ గుడి మెట్ల వద్ద ఆత్మహత్యకు యత్నిస్తుండగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సురక్షితంగా రక్షించారు.

 

కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగింత

 

విద్యార్థినిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు, జీవితం ఎంతో విలువైనదని, సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను సురక్షితంగా తాత సత్యరాజుకు అప్పగించారు. సమయానికి స్పందించి తన మనవరాలి ప్రాణాలను కాపాడిన సీఐ విక్రమ సింహ, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి మరియు పోలీసు సిబ్బందికి తాత సత్యరాజు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తక్షణ స్పందనను స్థానికులు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular