Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కోసిగి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ

కోసిగి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ

📰 Generate e-Paper Clip

నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

 

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  

 

పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

 

కర్నూలు క్రైమ్, మే 20, (సీమకిరణం న్యూస్) :

 

కోసిగి పోలీసు స్టేషన్ ను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్‌ కేసులను సమీక్షించారు. ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సైబర్ నేరాలపై, మహిళా చట్టాల పై మహిళలకు , నూతన చట్టాల పై ప్రజలకు అవగాహన చేయాలన్నారు. కర్నూలు ఎస్పీ గారితో పాటు కోసిగి సిఐ మంజునాథ్ , కోసిగి ఎస్సై రమేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular