Wednesday, April 22, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంవెల్దుర్తిలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

వెల్దుర్తిలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

వెల్దుర్తిలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు 

 

వెల్దుర్తి, ఏప్రిల్ 20, (సీమ కిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని పాత బస్టాండ్ లో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి కార్యాలయం వద్ద బాణా సంచా కాల్చి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన భారీ కేక్ ని కట్ చేసి పంపిణీ చేశారు. టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్, వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షుడు టి. బలరాం గౌడ్, టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుండి స్పందించే నాయకత్వం, పారదర్శకతతో కూడిన పరిపాలన, భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే దూరదృష్టి వంటి విశిష్ట లక్షణాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, అభివృద్ధి పట్ల ఉన్న అంకితభావం నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడంలో చంద్రబాబు పాత్ర కీలకమని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఆయన ఒక విజినరీ లీడర్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular