ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
నడివేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటివరకు ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించింది- రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంట చేతికి అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమేర దెబ్బకొట్టాయి.
ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఈ ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత విస్తరించింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అక్కడక్కడ ఏపీ తేలికపాటి జల్లులు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.

అలాగే- తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడరని చెప్పారు. పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని అన్నారు.

