అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు జరిగే విషయం తెలిసిందే. ఇరాన్ కూడా అంతే స్థాయిలో రెచ్చిపోయి ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఇరాన్ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం హార్మూజ్ జలసంధిని మూసివేసింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న F-15 ఫైటర్ జెట్ ను తమ బలగాలు పేల్చేసినట్లు ఇరాన్ నుంచి ప్రకటన విడుదల అయింది. అలాగే తన అధికారిక ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను టెహ్రాన్ టైమ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియో నిడివి 29 సెకన్లు ఉంది. ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన తరుణంలో ఇరాన్ ఇలాంటి చర్యకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది.
#బ్రేకింగ్
శత్రువు యొక్క F-15 ఫైటర్ జెట్‌ను దేశం యొక్క దక్షిణ తీరంలో అడ్డగించిన తర్వాత హోర్ముజ్ ద్వీపం సమీపంలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కాల్చివేసాయి. pic.twitter.com/jmrFuUQKbd— టెహ్రాన్ టైమ్స్ (@TehranTimes79) మార్చి 22, 2026
మరోవైపు ఫోర్త్ జనరేషన్ F-15 ఫైటర్ జెట్ అమెరికాకు చెందినదా..? లేదా ఇజ్రాయెల్ కు చెందినదా..? అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఘటనపై అటు అమెరికా నుంచి గానీ ఇటు ఇజ్రాయెల్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెల్లడికాకపోవడం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అంతకుముందు ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు వార్నింగ్ ఇచ్చారు.

ఇక ట్రంప్ వార్నింగ్ అనంతరం ఇదే విషయంపై ఇరాన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ హార్మూజ్ జలసంధి కేవలం ఇరాన్ శత్రు దేశాలకే మూసి ఉందని స్పష్టం చేశారు. మెరిటైమ్ కార్యకలాపాలు మరింత సులభంగా కొనసాగడానికి ప్రపంచ దేశాలు, సంస్థలకు ఇరాన్ సహకారమని తెలియజేస్తుంది. ఇటీవల అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ ను సైతం ఇరాన్ పేల్చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు. తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ ను సైతం ఇరాన్ పేల్చేసిన ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

