ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 62,074 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,784 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుండి 18 గంటల సమయం పట్టింది.
కాగా- మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే పండుగలు, ఉత్సవాలు, ఇతర విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మార్చి 2వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తితో మార్చి నెల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తిరుమలలో తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్వామివార్లు ఊరేగుతున్నారు. మార్చి 2వ తేదీన ఇవి ముగుస్తాయి.

3న కుమార తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఆ రోజున తెల్లవారుజామున 5 గంటల నుండి మ’ధ్యాహ్నం వర’కు మాత్రమే కుమారధార తీర్థాన్ని దర్శించుకోవచ్చు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతులు ఉండవు. గోగర్భం నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతి ఇస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేట్ వాహనలను కూడా వెళ్లనివ్వరు.
అదే రోజున చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. భక్తులకుస్తారు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. 15న వైష్ణవ ఏకాదశి కార్యక్రమం ఉంటుంది. ఇక 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, నూతన తెలుగు సంవత్సరాది ఉత్సవాలను నిర్వహించారు. 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం, 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభమౌతాయి.

