Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణసాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్‌గా డిప్యూటీ స్పీకర్ ! | సీఎం చంద్రబాబు,...

సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్‌గా డిప్యూటీ స్పీకర్ ! | సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న సాంస్కృతిక ఉత్సవం డిప్యూటీ స్పీకర్ పనితీరు హైలైట్

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-కొరివి జయకుమార్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా విజయవాడలోని ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజా సమస్యలు, అసెంబ్లీ చర్చలు, రాజకీయ విమర్శల మధ్య నిత్యం ఉండే ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం ఒక మంచి ఆటవిడుపుగా మారింది. ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఆహ్లాదకర వాతావరణంలో సమయాన్ని గడిపారు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. మంత్రి నారా లోకేష్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. కాగా మంత్రి నారా లోకేష్ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలతో సరదాగా ఆటలు ఆడుతూ సందడి చేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన క్రీడల్లో విజేతలైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతులు కూడా ఉన్నాయి.

CM-చంద్రబాబు-మరియు-ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలు-పాల్గొన్నారు-సాంస్కృతిక-ఉత్సవ-విజయవాడ-అల్సి-డిప్యూటీ-స్పీకర్-పర్

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ ప్రార్థనా గీతం ఆలపించి శుభారంభం చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు భీముడి పాత్రలో నటించి తన నటనతో అందరిని మెప్పించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో ఆకట్టుకున్నారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ స్వాతంత్ర్య సమరయోధుడు వీరపాండ్య కట్టబొమ్మన్ పాత్రలో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ఇక ఎమ్మెల్యే విజయ్ కుమార్ ‘రుద్రవీణ’ “లలిత ప్రియ కమలం” పాటను ఆలపించారు.వీరితో పాటు జీవీ ఆంజనేయులు, కామినేని శ్రీనివాస్, జయమంగళ వెంకటరమణ, సునీల్ తదితర ప్రజాప్రతినిధులు కూడా వివిధ పాత్రల్లో పాల్గొని ఉత్సాహంగా మార్చారు. అనంతరం బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్.. సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular