భారీ ర్యాలీతో నామినేషన్‌కు బయలుదేరిన రమేష్ శెట్టి..
అభిమానులు, మద్దతుదారులతో సందడి
కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 21 (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తిరువీధి రమేష్ శెట్టి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు తన నివాసం నుంచి అభిమానులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని రమేష్ శెట్టికి మద్దతు తెలిపారు. అనంతరం వెల్దుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న తిరువీధి రమేష్ శెట్టి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ.)కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రమేష్ శెట్టి నామినేషన్ కార్యక్రమం గ్రామంలో రాజకీయ సందడి నెలకొల్పింది. భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు పాల్గొనడంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

