Wednesday, November 25, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు

📰 Generate e-Paper Clip

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు

 

అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పణ.. 

 

కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 21 (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ ఉన్నారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో నిలిచిన బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలుతో గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి మరింత పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular