Wednesday, November 25, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్..

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్..

📰 Generate e-Paper Clip

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్..

 

టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం

 

శనివారం ఉదయం శంకర్ రెడ్డి కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు నామినేషన్ ర్యాలీ

 

కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, నవంబర్ 20, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, బొమ్మన శివశంకర్ రెడ్డి అభిమానులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ ఆశీస్సులతో, పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యాంబాబు నాయకత్వంలో బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం తమ ప్రియతమ నాయకుడు బొమ్మన రామకాంత రెడ్డి శంకర్ రెడ్డి కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మనస్ఫూర్తిగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular