Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తిలో పోలీసు విధులకు ఆటంకం.. దురుసు ప్రవర్తనకు రిమాండ్‌తో సమాధానం!

వెల్దుర్తిలో పోలీసు విధులకు ఆటంకం.. దురుసు ప్రవర్తనకు రిమాండ్‌తో సమాధానం!

📰 Generate e-Paper Clip

పోలీసు విధులకు ఆటంకం.. యువకుడి అరెస్ట్

 

కానిస్టేబుల్ షర్టు కాలర్ పట్టుకుని బెదిరింపులు..

 

కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన వెల్దుర్తి పోలీసులు

 

 

వెల్దుర్తి, సెప్టెంబర్ 02, (సీమకిరణం న్యూస్):

 

విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని వెల్దుర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ బాయ్స్ ప్రాంగణంలో శ్రీనివాస్ గౌడ్ అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకుని అందులో లెట్రిన్ గుంతలు త్రవ్వినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గుంతలను పూడ్చివేసేందుకు జడ్పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హెడ్‌మాస్టర్ అభ్యర్థన మేరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ రాంబాబు, హోంగార్డు వెంకట్ రాముడు విధులకు హాజరై గుంతలు పూడ్చే కార్యక్రమానికి రక్షణ కల్పిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ కుమారుడు భరత్ గౌడ్, విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాంబాబుపై దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాంబాబు షర్టు కాలర్ పట్టుకుని, ఉద్యోగం పీకిస్తానంటూ బెదిరించి పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు భరత్ గౌడ్ (24), (తండ్రి పేరు శ్రీనివాస్ గౌడ్‌) ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసి అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా పోలీసు విధులకు ఆటంకం కలిగించినా, పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినా, లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నా చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో చట్టబద్ధమైన పద్ధతిలో తమ పనులు చేయించుకోవాలని, విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడడం లేదా భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular