Tuesday, November 3, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తికి మరో బీసీ బాలికల వసతి గృహం మంజూరు!

వెల్దుర్తికి మరో బీసీ బాలికల వసతి గృహం మంజూరు!

📰 Generate e-Paper Clip

వెల్దుర్తికి మరో బీసీ బాలికల వసతి గృహం మంజూరు!

 

 

వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఏర్పాటు చేస్తాం

 

 

బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, ఐఏఎస్ హామీ

 

 

బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

 

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 03 (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం, జ్యోతిరావు పూలే బీసీ బాలికల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, ఐఏఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆయన, అక్కడి వసతులు, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వసతి గృహ సంక్షేమ అధికారిణి గిరిజాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి సౌకర్యం లేక ఎంతమంది విద్యార్థినులు వెనుదిరిగారని ఆరా తీశారు. దాదాపు 400 మంది విద్యార్థినులు సీట్లు లభించక వసతి గృహంలో ప్రవేశం పొందలేక వెనుదిరిగారని సంక్షేమ అధికారిణి వివరించారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ వచ్చే విద్యా సంవత్సరం నాటికి వెల్దుర్తిలో బీసీ బాలికల కోసం మరో వసతి గృహాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వసతి కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినులకు ఊరట కలగనుంది. అనంతరం వసతి గృహంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి జ్యోతిరావు పూలే బీసీ బాలికల పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న విద్యా, వసతి సౌకర్యాలు, మౌలిక వసతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సీనియర్ టీడీపీ నాయకులు ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular