Sunday, April 26, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలి

వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలి

📰 Generate e-Paper Clip

వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలి

 

కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్

 

కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) : 

 

వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజల్ ను సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పెట్రోల్ బంక్ ల యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం నగరంలోని సూర్యదేవాలయం పక్కన ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్, బళ్లారి చౌరస్తాలోని నయారా పెట్రోల్ బంక్ ను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పెట్రోల్ బంక్ లో సరైన నిల్వలు ఉండే విధంగా చూ సుకోవాలని , వినియోగదారులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్,డీజల్ సరఫరా చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు జరగకూడదని జేసీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేసీ వాహనదారులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ అవసరానికి తగినంత నిల్వ ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ రాజా రఘువీర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular