సర్వో ఆయిల్ తో ఇంజన్లు సురక్షితం
వాహనదారుల భద్రతే ఇండియన్ ఆయిల్ కు ముఖ్యం
సర్వో ఆయిల్ రాయలసీమ రీజినల్ మేనేజర్ సురేంద్ర
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, (సీమకిరణం న్యూస్) :
వాహనదారులు తమ వాహనాలకు సర్వో ఆయిల్స్ వాడకంతో వాహన ఇంజన్లు సురక్షితంగా ఉంటాయని సర్వో ఆయిల్స్ రాయలసీమ రీజినల్ మేనేజర్ సురేంద్ర చెప్పారు. వాహనదారుల భద్రతే ఇండియన్ ఆయిల్ సంస్థ కు ముఖ్యమని అన్నారు. గురువారం కర్నూలులో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్స్ ఓ హోటల్లో నిర్వహించిన రీసెల్లర్ మీట్ లో ఆయన పాల్గొని వాహన వినియోగదారులు, రీసెల్లర్లతో మాట్లాడారు. ఆధునాతన టెక్నాలజీతో ఇండియన్ ఆయిల్స్ ఆధ్వర్యంలో సర్వో లూబ్రికేంట్స్ సరికొత్త టెక్నాలజీతో కూడిన ఇంజన్ ఆయిల్స్ ను ప్రవేశపెట్టిందని చెప్పారు. సర్వో ఇంజన్ ఆయిల్ వాడకం వల్ల వాహనదారుల ఇంజన్లు సురక్షితంగా ఉండడంతో పాటు అత్యధిక కాలం మన్నికగా ఉంటాయని అన్నారు. సర్వో నూతనంగా ప్రవేశపెట్టిన హైపర్ సిరీస్ ఇంజన్ ఆయిల్స్ వాడకంతో అధిక మైలేజీ కూడా వస్తుందన్నారు .వాహన వినియోగదారులు చౌక ధరకు లభించే క్వాలిటీ లేని ఇంజన్ ఆయిల్ వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కు వాహనదారుల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. మిగతా ఇంజన్ ఆయిల్ కన్నా సర్వో ఇంజన్ ఆయిల్స్ అధిక శాతం నాణ్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, వాహన వినియోగదారులందరూ తమ మోటారు వాహనాలు, కార్లు, కమర్షియల్ పెద్ద వాహనాలకు సర్వో ఇంజన్ ఆయిల్ వాడకంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. సర్వో హైపర్ సిరీస్ ఇంజన్ ఆయిల్ ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడిన ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ అని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ అమర్ కుమార్ బలవంతరాయ్ తో పాటు కర్నూలు మేనేజింగ్ పార్ట్నర్ గోపాల కృష్ణారెడ్డి తదితర సర్వో ఆయిల్ రీసెల్లర్లు పాల్గొన్నారు.

