Saturday, July 25, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రీ-నీట్–2026 ఫలితాల్లో కర్నూలు నారాయణ విద్యార్థుల సత్తా

రీ-నీట్–2026 ఫలితాల్లో కర్నూలు నారాయణ విద్యార్థుల సత్తా

📰 Generate e-Paper Clip

జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు.. కళాశాల యాజమాన్యం హర్షం

 

కర్నూలు ప్రతినిధి, జూలై 17, (సీమకిరణం న్యూస్): 

జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించిన విద్యార్థులు కర్నూలు నారాయణ కళాశాలకు మరోసారి గర్వకారణంగా నిలిచారని కళాశాల కోర్ డీన్ డా. పి. లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసిన రీ-నీట్–2026 ఫలితాల్లో కర్నూలు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచారని యాజమాన్యం తెలిపింది. కళాశాలకు చెందిన టి. శ్రీష్ రెడ్డి 637 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)–2570 సాధించగా, పి. మధురి 610 మార్కులతో AIR–7199, ఎన్. సారూ నీల్ 603 మార్కులతో AIR–9127, ఎన్. ఆశ్రిత 595 మార్కులతో AIR–11789 సాధించారు. అదేవిధంగా మరెందరో విద్యార్థులు జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి కళాశాల ప్రతిష్ఠను చాటారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల కోర్ డీన్ డా. పి. లింగేశ్వరరెడ్డి అభినందించి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular