అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,, ప్రారంభోత్సవాలు
రూ. 6 కోట్లకుపైగా పనుల ప్రారంభం
పర్చూరు, ఫిబ్రవరి 01, (సీమకిరణం న్యూస్) :
పర్చూరు నియోజకవర్గ పరిధిలో ని యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో సోమవారం రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృత పర్యటన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు యనమదల గ్రామంలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10.45 గంటలకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ద్వారా గ్రామానికి మెరుగైన రవాణా సదుపాయాలు కలుగనున్నాయి. తదుపరి ఉదయం 11.30 గంటలకు యనమదల గ్రామంలో రూ.4.65 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ సబ్‌స్టేషన్ ప్రారంభంతో పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా, నాణ్యంగా మారనుంది.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించే సభలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి అందజేయనున్నారు.

