కర్నూలులో 29 బైక్‌ల బహిరంగ వేలం : ఓనర్లకు నాలుగో పట్టణ పోలీసుల ఆఖరి అవకాశం!
కర్నూలు క్రైమ్, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్ ):
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచిన 29 ద్విచక్ర వాహనాలను త్వరలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు నాలుగో పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విక్రమసింహ తెలిపారు. ఈ వాహనాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి, వాటి ప్రస్తుత పరిస్థితిని బట్టి వాల్యుయేషన్ సర్టిఫికేట్ జారీ చేసి, స్క్రాప్ వాహనాలుగా విలువ నిర్ధారణ చేశారు. ఈ వాహనాలకు సంబంధించిన అసలు యజమానులు ఎవరైనా ఉంటే, తమ వాహనంపై హక్కును నిరూపించే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్ సి), బీమా పత్రాలు, గుర్తింపు కార్డు మరియు ఇతర సంబంధిత ధ్రువపత్రాలతో వెంటనే కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. నిర్దేశిత గడువులోగా ఎవరూ యాజమాన్యాన్ని నిరూపించుకోని పక్షంలో, చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసుల స్వాధీనంలో ఉన్న 29 ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ చేపడతామని సీఐ విక్రమసింహ స్పష్టం చేశారు. సంబంధిత వాహన యజమానులు ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తమ వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వేలానికి సిద్ధంగా ఉన్న 29 ద్విచక్ర వాహనాల వివరాలు
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో స్వాధీనంలో ఉన్న వాహనాల్లో హీరో హోండా స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్, గ్లామర్, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్లస్, CBZ, హోండా షైన్, బజాజ్ పల్సర్, ప్లాటినా, డిస్కవర్, బాక్సర్, కాలిబర్, TVS స్టార్ సిటీ, సెంట్రా, ఎక్సెల్, XL హెవీ డ్యూటీ, XL, స్కూటీ పెప్+ తదితర మోడళ్లకు చెందిన మొత్తం 29 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటిని రవాణా శాఖ అధికారులు పరిశీలించి స్క్రాప్ వాహనాలుగా ధ్రువీకరించారు.
గుర్తింపు కోసం ప్రధాన రిజిస్ట్రేషన్/చాసిస్ నంబర్లు:
AP22 J5882, AP11 S3439, TS33 A4557, AP21 M4498, AP21 AL8498, AP28 AA3332,
AP03 S2324, AP09 AT1766, AP21 J5163, OR04 H0388, AP22 J0298, AP21 P9905,
AP21 BR9880, AP03 AE0418, AP27 H5013, AP03 K8012, AP21 Q9507, AP21 D1265,
అదనంగా కొన్ని వాహనాలకు చాసిస్ నంబర్లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఒక వాహనానికి చాసిస్ నంబర్ గుర్తించలేకపోయినట్లు జాబితాలో పేర్కొన్నారు.

