మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టబోతున్న పార్టీకి ఈ లెక్క ఏమిటో అందరికీ తెలిసిందే ..
విజయవాడ ప్రతినిధి, నవంబర్ 11 (సీమకిరణం న్యూస్):
11వ తేదీ 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు.. ఇదేదో మంచి ముహూర్తం అని అనుకోవద్దు. ఒకవేళ మంచి ముహూర్తమే కావచ్చు కానీ ఆయన ఈ ముహూర్తాన్ని వైసీపీని హేళన చేస్తూ జగన్ ని టార్గెట్ చేసేందుకు మాత్రమే వాడుకున్నట్టు స్పష్టం అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడంపై హేళనగా ఈ పార్టీ స్థాపనకు అన్నీ 11 లెక్కలో తీసుకున్నారు. ఒకప్పుడు జగన్ తో పాటు 18 నెలలు జైల్లో ఉండి జగన్ తో పాటు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి , ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత తాను అవమానాలు పాలయ్యానని తనను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వేధింపులకు, అవమానాలకు గురి చేశాడని నాయకుడుకి చాడీలు చెప్పి తనను దూరం చేశారని ఇటీవల అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు . ఆ కక్షతోనే ఆయన పార్టీ ప్రారంభ సమయం 11 గంటల, 11 నిమిషాల, 11 సెకన్లకు, 11వ తేదీనే ముహూర్తం ఖరారు చేసినట్టున్నారు.

