Tuesday, April 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమద్యం కొనాలంటే.. ఇక ఇలా తప్పనిసరి- తాజా మార్గదర్శకాలు..!! | అన్ని బార్‌లు మరియు వైన్...

మద్యం కొనాలంటే.. ఇక ఇలా తప్పనిసరి- తాజా మార్గదర్శకాలు..!! | అన్ని బార్‌లు మరియు వైన్ షాపులలో మద్యం అమ్మకాల చెల్లింపులపై ప్రభుత్వం ముందు AP ఎక్సైజ్ కీలక ప్రతిపాదనలు, వివరాలు ఇక్కడ ఉన్నాయి

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

మద్యం విక్రయాల విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో కొత్త విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. మంత్రివర్గ ఆమోదం లభించగానే తమ ప్రతిపాదనల మేరకు ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా విక్రయాల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ విధానం పైన మందు బాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కీలకంగా మారుతోంది.

మద్యం విక్రయాల్లో ఎక్సైజ్‌ శాఖ నూతన విధానాన్ని తీసుకురానుంది. ‘లిక్కర్‌ డిజిటల్‌ చెల్లింపులు’ పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నా ఈ శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు ‘లిక్కర్‌ డిజిటల్‌ చెల్లింపులు’ పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. నెల రోజుల వ్యవధిలో ఈ పాలసీ అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. పాలసీ అమల్లోకి ప్రతి బార్‌, మద్యం షాపులో కచ్చితంగా డిజిటల్‌ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ విధానం ప్రకారం.. మద్యం కొనుగోలుదారులు డిజిటల్‌ విధానంలో బిల్లు చెల్లింపులు డిజిటల్ విధానంలో కొనసాగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల ను విక్రయదారులు తిరస్కరించకూడదని అధికారులు స్పష్టం చేసారు. డిజిటల్‌ చెల్లింపులు అందజేయాలనే నిబంధనను మద్యం షాపు, బార్‌ పాలసీల్లో ఎక్సైజ్‌ శాఖ పరిశీలిస్తోంది. ప్రతిసారి పాలసీలో ఈ నిబంధన తప్పనిసరిగా పెట్టాల్సి వస్తోంది. అయితే, ఈ నిబంధనను షాపులు, బార్ల లైసెన్సీలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు.

AP-ఎక్సైజ్-కీ-ప్రతిపాదనలు-ప్రభుత్వానికి-ముందు-అధిక-చెల్లింపులు-అన్ని-బార్లు-మద్యం-అమ్మకాలు-అలాగే-వైన్-షాపుల్లో-కూడా-

డిజిటల్ పేమెంట్స్ పై మార్గదర్శకాలు

ఈ నేపథ్యంలో ప్రతిసారీ మద్యం పాలసీల్లో ఈ నిబంధన పెట్టాల్సిన అవసరం లేకుండా డిజిటల్ చెల్లింపులను శాశ్వతంగా అమలుచేయడం కోసం ఈ పాలసీని ఎక్సైజ్ శాఖ తీసుకురానుంది. ప్రస్తుత విధానంలో డిజిటల్ చెల్లింపులు చేసినా సంబంధిత లైసెన్సీకి మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం సుమారు 30 శాతం మేర డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నా ఆ సమాచారం ఎక్సైజ్‌కు చేరడం లేదు. నూతన పాలసీ అమల్లోకి వచ్చాక ఎవరు డిజిటల్‌ చెల్లింపులు చేశారనే సమాచారం రియల్‌టైమ్‌లో ఎక్సైజ్‌ డేటాబేస్‌లో నిక్షిప్తం అయ్యేలా సాంకేతికంగా సిద్దం చేసారు. డిజిటల్‌ చెల్లింపులతో పాటు ఎక్సైజ్‌ శాఖ కొత్తగా ‘ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌’ తీసుకువస్తోంది. కొత్త ట్రాకింగ్ విధానంలో ప్రతి షాపు, బారుకు స్కానర్‌ ఇస్తారు. కచ్చితంగా స్కాన్ తర్వాత మాత్రమే సీసాలను కొనుగోలు చేయడానికి విక్రయించాలి. స్కాన్ చేసిన వెంటనే ఆ సమాచారం ఎక్సైజ్‌ డేటాబేస్‌కు చేరుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు డిజిటల్ పేమెంట్ చేస్తే ఆ సమాచారం కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. దీంతో.. మద్యం కొనుగోలు కోసం ఇక డిజిటల్ చెల్లింపులకు సిద్దం కావాల్సిందే.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular