Wednesday, August 26, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పాణ్యం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ 

పాణ్యం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ 

📰 Generate e-Paper Clip

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

 

 ఎన్ఫోర్స్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి

 

నంద్యాల జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ 

 

నంద్యాల క్రైమ్, ఆగస్టు 26, (సీమకిరణం న్యూస్):

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్  సోమవారం సాయంత్రం పాణ్యం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ ముందుగా స్టేషన్ వద్ద ఉన్న ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను చట్టపరిధిలో పరిశీలించి, న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, రికార్డ్ రూమ్, ప్రాపర్టీ రూమ్ తదితరాలను జిల్లా ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించి, ఆయా కేసుల దర్యాప్తు పురోగతి, దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా, పూర్తి వివరాలతో అప్డేట్‌లో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రాపర్టీ కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగాన్ని పెంచి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీసుల ఉనికి ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. నేరాలు జరిగిన అనంతరం స్పందించడమే కాకుండా, నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి కారణాలను విశ్లేషించి, సంబంధిత శాఖల సమన్వయంతో తగిన నివారణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్  ఆదేశించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసింగ్ సేవలు అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ  పోలీసు సిబ్బందికి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular