Tuesday, August 25, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా

ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా

📰 Generate e-Paper Clip

ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా

 

 

కర్నూలు ఎస్పీ చేతుల మీదుగా ‘ఉత్కృష్ట’ సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్) : 

 

 

విధి నిర్వహణలో ప్రతిభ, నిబద్ధత, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించినందుకు కర్నూలు 4టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ బి.వి. విక్రమ్ సింహాకు ‘ఉత్కృష్ట సేవా పతకం’ లభించింది. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా సీఐ విక్రమ్ సింహా సేవా పతకాన్ని అందుకున్నారు. 2025–26 సంవత్సరానికి విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అతి ఉత్కృష్ట’, ‘ఉత్కృష్ట’ సేవా పతకాలలో భాగంగా ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ గౌరవం దక్కిందన్నారు. సేవా పతకాలు పొందిన వారిని మిగతా పోలీసు సిబ్బంది ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న సీఐ విక్రమ్ సింహాను పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular