Tuesday, May 12, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

 

కర్నూలు ఒకటవ పట్టణ సిఐ మారుతి శంకర్

 

నేర చరిత్ర ( క్రికెట్ బెట్టింగ్) నేపథ్యం కలిగిన వ్యక్తికి కౌన్సిలింగ్ నిర్వహించిన కర్నూలు ఒకటవ పట్టణ సిఐ మారుతి శంకర్

 

కర్నూలు క్రైమ్, మే 12, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు కర్నూలు ఓల్డ్ టౌన్ ఖలీల్ స్ట్రీట్ కు చెందిన కె. మజీత్ ఖాన్ నేర నేపథ్యం కలిగి ఉండడంతో మంగళవారం ఉదయం కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడకూడదని, భవిష్యత్తులో ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలని పాల్గొనరాదని హెచ్చరించారు. అనంతరం అతనిని కర్నూలు అర్బన్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ఎదుట హాజరుపరచారు.  ముందస్తుగా 6 నెలల బాండ్ కాలపరిమితిలో నేరానికి పాల్పడితే, పూచీకత్తు మొత్తం ప్రభుత్వానికి జప్తు అవుతుందని మరియు చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు తహసీల్ధార్ వద్ద రూ. లక్ష రూపాయల పూచికత్తు తో బైండోవర్ చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు కొనసాగుతాయని కర్నూలు పోలీసు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular