నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వెల్దుర్తి, జూలై 10, (మహా జ్యోతి న్యూస్):
విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్వహణ పనులలో భాగంగా రేపు రెండో శనివారం వెల్దుర్తి, రామళ్లకోట, కలుగొట్ల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వేళలు ఈ విధంగా ఉంటాయని పేర్కొన్నారు.
అన్ని ఫీడర్లకు :
🔹 ఉదయం 5:00 గంటల నుంచి 9:00 గంటల వరకు
🔹 మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వెల్దుర్తి మండల విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

