seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 4:24 pm Digital Edition : SEEMA KIRANAM

నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

 

వెల్దుర్తి, జూలై 10, (మహా జ్యోతి న్యూస్):

 

విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్వహణ పనులలో భాగంగా రేపు రెండో శనివారం వెల్దుర్తి, రామళ్లకోట, కలుగొట్ల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వేళలు ఈ విధంగా ఉంటాయని పేర్కొన్నారు.

అన్ని ఫీడర్లకు :

🔹 ఉదయం 5:00 గంటల నుంచి 9:00 గంటల వరకు

🔹 మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వెల్దుర్తి మండల విద్యుత్ శాఖ అధికారులు కోరారు.