నూతన చైర్మన్ మునీర్ భాషను సన్మానించిన అమీన్ పీర్ శిష్యులు
నెల్లూరు సిటీ, జూన్ 18, (సీమకిరణం న్యూస్): నెల్లూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, మతసామరస్యానికి ప్రతీక అయిన బరాషహీద్ దర్గా రొట్టెల పండుగ మరియు గంధ మహోత్సవం 2026 నూతన చైర్మన్‌గా నియమితులైన షేక్ మునీర్ భాషకు అభినందనలు, సన్మానాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం బారా షాహిద్ దర్గా ప్రాంగణంలో కోటమిట్టకు చెందిన కడప అమీన్ పీర్ స్వామి వారి శిష్యులు నూతన చైర్మన్ షేక్ మునీర్ భాషను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించి...