తిరుపతి అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న జె. బాబు ప్రసాద్‌కు ఘన వీడ్కోలు
తిరుపతి అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న జె. బాబు ప్రసాద్‌కు ఘన వీడ్కోలు కర్నూలు క్రైం, జూన్ 18, (సీమకిరణం న్యూస్) : కర్నూలు సబ్ డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ, అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై తిరుపతి లా అండ్ ఆర్డర్ విభాగంలో బాధ్యతలు చేపట్టబోతున్న జె. బాబు ప్రసాద్ గారికి కర్నూలులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కర్నూల్ నగరంలోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌కు చెందిన టీజీవీ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ...