Saturday, July 25, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తహసీల్దార్ ఆంజనేయులు చొరవతో 500 కుటుంబాల ఇంటి పట్టాల కల సాకారం

తహసీల్దార్ ఆంజనేయులు చొరవతో 500 కుటుంబాల ఇంటి పట్టాల కల సాకారం

📰 Generate e-Paper Clip

తహసీల్దార్ ఆంజనేయులు చొరవతో 500 కుటుంబాల ఇంటి పట్టాల కల సాకారం

 

వందేళ్ల నాటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం – ఘనంగా సన్మానించిన లబ్ధిదారులు

 

కర్నూలు ప్రతినిధి, జూలై 16, (సీమకిరణం న్యూస్) :

 

వందేళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న భూ సమస్యకు తెరదించడంలో కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవ, నిరంతర కృషి ఫలితంగా 500 కుటుంబాలకు ఇంటి పట్టాలు అందేలా మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు, గ్రామ పెద్దలు తహసీల్దార్ ఆంజనేయులను పూలదండ వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపిన నిబద్ధతను కొనియాడారు. భూ సమస్య పరిష్కారంలో జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారుల సమన్వయంతో చర్యలు వేగవంతం కాగా, తహసీల్దార్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని పలువురు అభినందించారు. 500 కుటుంబాలకు ఇంటి పట్టాలు లభించడం వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular