Sunday, April 26, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! |...

తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! | పారావీల్ సర్వే TN అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రయాంగిల్‌ను అంచనా వేసింది, రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలను వెల్లడించింది

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-సాయి చైతన్య

తమిళనాడు అధికారంలో దక్కేదెవరికి. ఇప్పుడు ప్రధాని మోదీ సహా బీజేపీ అధినాయకత్వం తమిళనాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుస పర్యటనలు… కొత్త వరాలు.. ప్రారంభోత్సవాలతో ఈసారి తమిళనాడులో బలం చూపించేందుకు సిద్దమైంది. అటు సినీ హీరో టీవీకే విజయ్ పాత్ర కీలకంగా మారుతోంది. దీంతో.. త్రిముఖ పోరు వేళ తమిళనాడులో ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే సంస్థ సంచలన అంచనాలను వేసింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు. అధికారంలో ఉన్న డీఎంకే తిరిగి పీఠం నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అన్నా డీఎంకేతో జత కట్టిన బీజేపీ ఎన్నికల్లో కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. సినీ హీరో టీవీకే విజయ్ పాత్ర కీలకంగా మారుతోంది. ఇదే టైం లో ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ పారావీల్‌ కేకే సర్వేస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌ తమ అంచనాలను రూపొందించింది. మళ్లీ డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా అభిప్రా యాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది. ఈ సర్వే వివరాలను ఆ సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి కోసం. డీఎంకేకు 41.5 శాతం, అన్నాడీఎంకేకు 36.2 శాతం, టీవీకేకు 13.6 శాతం, నామ్‌ తమిళర్ కట్చికి 7.9 శాతం మంది మద్దతు తెలిపారని వివరించారు. కేకే పారావీల్‌ అనే వెబ్‌సైట్‌ ప్రారంభించి ఎగ్జిట్‌ పోల్స్‌ 2026 పేరుతో పారదర్శకంగా సర్వే నిర్వహించామని.

పారావీల్-సర్వే-తెలంగాణ-అసెంబ్లీ-ఎన్నికలలో-కొత్త-త్రిభుజం-ప్రవచనం-రాష్ట్రంలో-ప్రధాన-కారకాల-బయటపెట్టింది-P

తమిళనాట మారుతున్న లెక్కలు

అందులో భాగంగా సర్వేలో కీలక అంశాలను గుర్తించినట్లు వివరించారు. ఇప్పటివరకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం అద్భుతంగా ఉందని 41.5 శాతం మంది అభిప్రాయపడ్డారని, విజయ్ పార్టీకి చెన్నైలో అధిక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్లు తేలిందని పేరొందారు. కోవై, డెల్టా జిల్లాలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ తమిళనాడుతో సహా కీలకమైన ఓటరు సెంటిమెంట్‌లను గుర్తించేలా తమ పరిశోధన సాగిందని, పాలన అవగాహన, ప్రభుత్వ వ్యతిరేక ధోరణుల వివరణాత్మక విశ్లేషణలతో పాటు ఈ సర్వే జరిపినట్లు వివరించారు. వారికి ఏ పార్టీతో సన్నిహిత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలకు ముందే ఎన్నికల ట్రెండ్‌ను తమ సంస్థ ఖచ్చితంగా అంచనా వేసిందని, ఆ ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేస్తున్నామని కిరణ్ కొండేటి వివరించారు. కాగా.. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో తాజా అంచనాలు వైరల్ అవుతున్నాయి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular