Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గో ప్రాధాన్యత...గోసేవావశ్యకత పుస్తకం ఆవిష్కరణ

గో ప్రాధాన్యత…గోసేవావశ్యకత పుస్తకం ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

గోమాత గొప్పతనం చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో తెలుసుకోవడం అదృష్టంగా ఉంది

 

రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా

 

చాగంటి కోటేశ్వరరావు యుగ పురుషుడు

 

మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్

 

కర్నూలు ప్రతినిధి, మే 22, (సీమకిరణం న్యూస్):

 

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు యుగ పురుషుడు అని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో గోమాత వైభవంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాతో కలిసి టీజీ వెంకటేష్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా గోమాతకు పూజ చేసి అనంతరం *గో ప్రాధాన్యత.. గోసేవావశ్యకత* అనే పుస్తకం ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని టీజీ వెంకటేష్, టీజీ భరత్ లకు చాగంటి కోటేశ్వరరావు అందించారు.

అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చాగంటి లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టే మనమందరం బాగున్నామని చెప్పారు. చాగంటి అనుకుంటే వందల కోట్లు సంపాదించొచ్చు కానీ చాగంటికి డబ్బుపై ఆశ లేదని.. ఆయనకు తెలిసినది ప్రజలకు చెప్పడమే ఆయనకు తెలుసన్నారు. టీజీ భరత్ గోమాతకు పూజ చేయడం, గోవులను సంరక్షించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. చాగంటి కోటేశ్వరరావు తమకు సన్మానం చేయడం తమ పూర్వజన్మ సుకృతం అని టీజీ వెంకటేష్ అన్నారు.

అనంతరం మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు కర్నూలుకు రావడం తమ అదృష్టం అన్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్నప్పటికీ ఆయన సామాన్యుడిలాగే ప్రయాణం చేస్తారని చెప్పారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో తెలపాలన్నారు. ఏపీలోనే అతిపెద్ద గోశాల కర్నూలులో ఉందన్నారు. గాయత్రి గోశాలలో 1200 పైగా ఆవులు ఉన్నాయన్నారు. గోమాతకు ఎలా పూజ చేయాలో పుస్తక రూపంలో తెలుపడం వల్ల ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గోశాల, గాయత్రి గోసేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ… గోసేవ ఎంతో గొప్పదని చెప్పారు. గోవును దానం చేయడం అంత గొప్ప దానం ఇంకోటి లేదన్నారు. ప్రతి రోజూ గోమాత సేవ చేయాలన్నారు. మనసు ఉత్సాహంగా ఉండాలంటే గోవును స్మరిస్తూ ఉండాలన్నారు. గోవులు సంచరించిన ప్రదేశం కంటే పవిత్రమైన ప్రదేశం ఇంకెక్కడా ఉండదు అని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular