Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

📰 Generate e-Paper Clip

కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

 

ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ

 

29న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

 

జిల్లాలోని 9 మండలాల్లో ఎన్నికల నిర్వహణ

 

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి

 

కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16 (సీమకిరణం న్యూస్):

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026 రెండో విడత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో రెండో విడతలో మొత్తం 9 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

నవంబర్ 18 నుంచి 20 వరకు: నామినేషన్ల స్వీకరణ.

నవంబర్ 21: ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.

నవంబర్ 22: సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు అవకాశం.

నవంబర్ 23: అప్పీళ్ల పరిష్కారం.

నవంబర్ 24: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.

నవంబర్ 24: మధ్యాహ్నం 3 గంటల అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటన.

నవంబర్ 29: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్.

నవంబర్ 29: మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక.

నవంబర్ 30: అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్, అనంతరం ఫలితాల ప్రకటన.

రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే!

కర్నూలు జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 9 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఆదోని రెవెన్యూ డివిజన్:

కోసిగి

కౌతాళం

మంత్రాలయం

పెద్దకడబూరు

గోనెగండ్ల

నందవరం

ఎమ్మిగనూరు

కర్నూలు రెవెన్యూ డివిజన్:

కల్లూరు

ఓర్వకల్లు

ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.

సీమకిరణం తెలుగు దినపత్రిక | కర్నూలు జిల్లా

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular