కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ
29న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
జిల్లాలోని 9 మండలాల్లో ఎన్నికల నిర్వహణ
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి
కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16 (సీమకిరణం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026 రెండో విడత ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో రెండో విడతలో మొత్తం 9 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
నవంబర్ 18 నుంచి 20 వరకు: నామినేషన్ల స్వీకరణ.
నవంబర్ 21: ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.
నవంబర్ 22: సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు అవకాశం.
నవంబర్ 23: అప్పీళ్ల పరిష్కారం.
నవంబర్ 24: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.
నవంబర్ 24: మధ్యాహ్నం 3 గంటల అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటన.
నవంబర్ 29: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్.
నవంబర్ 29: మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక.
నవంబర్ 30: అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్, అనంతరం ఫలితాల ప్రకటన.
రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే!
కర్నూలు జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 9 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఆదోని రెవెన్యూ డివిజన్:
కోసిగి
కౌతాళం
మంత్రాలయం
పెద్దకడబూరు
గోనెగండ్ల
నందవరం
ఎమ్మిగనూరు
కర్నూలు రెవెన్యూ డివిజన్:
కల్లూరు
ఓర్వకల్లు
ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.
సీమకిరణం తెలుగు దినపత్రిక | కర్నూలు జిల్లా