Sunday, November 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చెరుకులపాడు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

చెరుకులపాడు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

📰 Generate e-Paper Clip

కార్తీక మాసం సందర్భంగా చెరుకులపాడు శివాలయంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారి ప్రత్యేక పూజలు

 

వెల్దుర్తి, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్):

 

కార్తీక మాసం పవిత్ర సందర్భంగా చెరుకులపాడు గ్రామంలోని శ్రీ శివాలయంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పరమశివునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, పూలు, పండ్లతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని, ఆ పరమశివుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా శ్రీదేవమ్మ  ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular