తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంటే ఎక్కడలేని చోట్ల కాంగ్రెస్ దెబ్బ తింటుంది. కొన్ని చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది.మొత్తంగా ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు కోసం చేసిన పోరాటంలో అన్ని రాజకీయ పార్టీల ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు.
మహబూబాబాద్ బీఆర్ఎస్ ఖాతాలో
మహబూబాబాద్ మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ మహబూబాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో పడింది. మొత్తం 16 వార్డులకు జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ తొమ్మిది వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థులు 6 వార్డులలో గెలుపొందారు.

మరిపెడలో కాంగ్రెస్ విజయం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ అభ్యర్థులు 8 వార్డులలో గెలుపొందారు. బీఆర్ఎస్ ఆరు వార్డులు, ఇతరులు ఒక వార్డులో విజయం సాధించారు.
డోర్నకల్ కాంగ్రెస్ ఖాతాలో
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులలో 10 వార్డులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మిగిలిన నాలుగు వార్డులలో బీఆర్ఎస్ విజయం. దీంతో మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది.
వర్ధన్నపేటలో ఆధిక్యంలో బీఆర్ఎస్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 30 వార్డులలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 3 రౌండ్లలో, 4 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు బి ఆర్ ఎస్ ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ నాలుగు చోట్ల విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అధికారాన్ని ప్రదర్శిస్తోంది.
నర్సంపేటలో కాంగ్రెస్ హవా
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నర్సంపేటలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు మొత్తం ఏడు వార్డులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా, బీఆర్ఎస్ ఒక వాటికి 16వ వార్డును గెలుచుకుంది. పదవ వార్డులో సిపిఎం, 28వ వార్డులో బిజెపి జెండా ఎగురవేసి, ఒక్కో అవార్డు గెలుచుకున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కొనసాగిస్తోంది.

