Sunday, August 23, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్

📰 Generate e-Paper Clip

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్

 

 ఆత్మకూరు సీఐ గంగాధర్‌కు ఉత్తమ సేవా అవార్డు లభించింది. 

 

నెల్లూరు/ ఆత్మకూరు, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్):

 

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా సీఐ గంగాధర్ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఆయనకు ఈ ప్రత్యేక గుర్తింపు దక్కింది. అవార్డు అందుకున్న సీఐ గంగాధర్‌ను ఆత్మకూరు పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular