Monday, August 17, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఈనెల 29,30న జిల్లాలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటన

ఈనెల 29,30న జిల్లాలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటన

📰 Generate e-Paper Clip

జూలై 29,30న జిల్లాలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటన

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

 

కర్నూలు ప్రతినిధి, జూలై 27, (సీమకిరణం న్యూస్):

 

మానవ వనరుల అభివృద్ధి (విద్య), సమాచార సాంకేతికత (ఐటీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 29, 30 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జూలై 29 న ఆదోని, 30 వ తేదీన పత్తికొండ మండలాల్లో మంత్రి పర్యటన ఉన్నందున సంబంధించిన శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలో అధికారికంగా పర్యటన వివరాలు వెలువడుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular