Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతిరుమలలో చూసి తీరాల్సిన తెప్ప తిరునాళ్లు..: ఘనంగా ఆరంభం | టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో వార్షిక...

తిరుమలలో చూసి తీరాల్సిన తెప్ప తిరునాళ్లు..: ఘనంగా ఆరంభం | టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

తిరుమలలో భక్తుల ప్రదర్శన. బుధవారం నాడు 73,035 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,090 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 15 గంటల సమయం పట్టింది.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై తొలి రోజున శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు. భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తులకు ఊరేగింపు మొదలైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య ఆలయ నాలుగు మాడ వీధుల గుండ పుష్కరిణి వద్దకు ఉత్సవ మూర్తులు వేంచేపు చేశారు.

టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

అనంతరం పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే అయిదు రోజుల తెప్పోత్సవాలను “తెప్ప తిరునాళ్లు”గా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఫాల్గుణ / చైత్ర మాసాల్లో (ఫిబ్రవరి-మార్చి) ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. సాళువ నరసింహరాయలు 1,468 పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి- వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో ఉంది. మధ్యలో విరామం వచ్చినప్పటికీ 1,921లో తిరిగి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular