మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని పీఎఫ్ ఖాతాల్లో కనీస నిల్వ వెయ్యి, అంతకంటే తక్కువ ఉంటే దాన్ని ఆటోమేటిక్‌గా వారి సేవింగ్స్ ఖాతాలకు పంపబోతున్నారు.
వ్యాపారం
-సయ్యద్ అహ్మద్
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ఇవాళ భారీ ఊరట కల్పించే వార్త చెప్పింది. ఈపీఎఫ్ (EPFO)ఖాతాల్ని ఓ దశ వరకూ నిర్వహించే ఆ తర్వాత వదిలేసిన వాటిలో మిగిలిపోయిన డబ్బుల్ని ఆటోమేటిగ్గా ఖాతాదారులకు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుందో కూడా కేంద్రం. దీంతో వారు ఇకపై ఆ డబ్బుల కోసం పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
పీఎఫ్ ఖాతాల్లో చిన్న చిన్న బ్యాలెన్స్ లు మిగిలిపోయాయి, ఇన్ ఆపరేట్ గా ఉన్న ఖాతాలుంటే వాటిలోని ఖాతాదారులు వెయ్యి లేదా అంత కంటే తక్కువ మొత్తాల్ని ఆటోమెటిగ్గా వాటికి లింక్ అయి ఉన్న సేవింగ్స్ ఖాతాల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. దీనికి ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తు లేదా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

మూడు సంవత్సరాల పాటు ఎటువంటి చందా చెల్లించకుండా, లావాదేవీ జరగకుండా ఉంటే ఈపీఎఫ్ఓ అకౌంట్ నిరుపయోగంగా పరిగణిస్తారు. తాజా ప్రకారం ఇందులో వెయ్యి లేదా అంతకన్నా తక్కువ నిల్వ ఉంటే ఆ డబ్బును నేరుగా చందాదారుల లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాకు బదిలీ నిర్ణయం. లబ్ధిదారులు ఈ ప్రక్రియకు ఎటువంటి క్లేయిమ్ దాఖలు చేయనవసరం లేదు.

ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడు లక్షలకు పైగా నిరుపయోగ ఖాతాలు ఉన్నాయి. ఆధార్‌తో లింక్ చేసిన ఈ ఖాతాలకు సొమ్ము తక్షణమే చెల్లిస్తారు. మిగిలిన అర్హత కలిగిన ఖాతాలకు బదిలీలు దశలవారీగా జరుగుతాయి.ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, మిగిలిన 25 లక్షల నిరుపయోగ ఖాతాలను కూడా ఇలాంటి స్వయంచాలక వాపసు విధానం కిందకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఖాతాలు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి కార్యకలాపాలు లేవు, 20 సంవత్సరాలకు పైగా పాతవి కూడా. నిధుల సెటిల్‌మెంట్‌ను క్రమబద్ధీకరించడం, రాతపని తగ్గించడం, కార్మికులకు త్వరగా డబ్బులు అందించడమే దీని ఉద్దేశం.

