భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది.. గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతున్న తరుణంలో అందరూ పట్టరాని సంతోషంతో ఉన్నారు. అయితే ఇంతలో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక గంటలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ అక్కాచెల్లెళ్లు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు తెలుస్తోంది.
రాజస్థాన్ జోధ్ పూర్ లోని మనాయ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న అక్కాచెల్లెళ్లు విగతజీవులుగా మారారు. ఏమైందో ఏమోగానీ పెళ్లి కుమార్తెలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో ఆ తల్లిదండ్రుల రోదనలు ఆకాశాన్ని తాకాయి. పెళ్లి కుమార్తెలు శోభ (25), విమల (23) ఇద్దరూ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరికీ ఒకేరోజు వివాహం నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 21 శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఇంట్లో సంబరాలు, వేడుకలు జరిగాయి. ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో ఆ తల్లిదండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కాచెల్లెళ్ల శరీరం నీలిరంగులోకి మారడాన్ని గమనించిన వారి మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిలిపివేసి పోస్టుమార్టం కోసం.

పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం..అక్కచెల్లెళ్లు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే వారి వద్ద ఎలాంటి సూసైడ్ లేఖ లభించలేదని తేల్చారు. మరోవైపు ఇదే ఘటనపై కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా అన్నారు. అయితే వారికి ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తున్నారన్న కారణంతోనే వారు సూసైడ్‌కు కారణమైనట్లు మేనమామ జస్వంత్ సింగ్ ఆరోపిస్తున్నారు.

