Friday, April 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఈసారైనా.. | ktr సీఎం రేవంత్‌కి బహిరంగ...

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఈసారైనా.. | ktr సీఎం రేవంత్‌కి బహిరంగ లేఖ: కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలకు 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయించండి!

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

రాబోయే బడ్జెట్ లో హామీల అమలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం పదవీకాలం పూర్తి కావస్తున్నా హామీలు ఇంకా నెరవేర్చడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించాలని.. లేదంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగలేఖ రాశారు. ఈ సారైన బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తి హామీలో 95 శాతం పెండింగ్‌లోనే ఉంది. 6 గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు.. ఆ తర్వాత వాటి అమలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్‌లో అయినా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతుల కోసం ఇచ్చిన హామీల మేరకు భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈసారి కూడా హామీల అమలకు నిధులు కేటాయిస్తే మోసకారి కాంగ్రెస్‌ను ప్రజల పక్షాన నిలదీస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలకు 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తానని రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ లేఖ

“డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలి. ఆయా వర్గాలకు రెండు సంవత్సరాలుగా ఎగగొట్టిన హామీలు.. కాంగ్రెస్ ప్రకటించిన నిధుల బకాయిలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలి. గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ను ప్రజల పక్షాన నిలదీస్తాం” అని కేటీఆర్ సీఎంకు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular