తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందించారు. ఇప్పుడు, పెండింగ్లో ఉన్న రెండు పథకాలు అమలుకు సిద్దమవుతున్నాయి. మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటనకు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చూపుతోంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది.

ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తాత్కాలిక శాఖలవారిగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు జరిగాయి. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ఉన్నాయి. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
పెండింగ్ హామీల అమలుకు నిధుల కేటాయింపు
అధికారంలోకి వచ్చిన్నారేళ్లు పూర్తి కాన రెండు… ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ. 2, 500 .. అదే విధంగా పెన్షన్ రూ. 4,000 వరకు పెంపుపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. అదే విధంగా.. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదని సమాచారం. ఇక, 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
ఈ కేబినెట్లో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాల అమలుపై ప్రకటన ఉంటుందని భావించారు. అయితే, ఆర్దిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటు మూడు కార్పోరేషన్లు గా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో… సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలు పైన బడ్జెట్ లో ప్రకటన కోసం కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యం లో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి ఉంది.

