Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeఅంతర్జాతీయంవచ్చిరాని వైద్యం చేస్తే చర్యలు తప్పవు

వచ్చిరాని వైద్యం చేస్తే చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

వచ్చిరాని వైద్యం చేస్తే చర్యలు తప్పవు

 

ఆర్‌ఎంపీ, పీఎంపీ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు

 

వైద్యాధికారి డాక్టర్ రాహుల్

 

ప్యాపిలి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) :

 

పట్టణంలోని పలు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను వైద్యాధికారి రాహుల్ ఆరోగ్య సిబ్బంది. రాఘవేంద్ర గౌడ్ మనోహర్ రెడ్డితో కలిసి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యపరంగా ఎలాంటి అర్హత లేకుండా వచ్చిరాని వైద్యం చేస్తున్నట్లు ప్రజల ఆరోపణలు వస్తున్నాయని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ క్లినిక్‌లు నడుపుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే చట్టపర చర్యలు తప్పవని వైద్య అధికారి డాక్టర్ రాహుల్ హెచ్చరించారు. ఆర్‌ఎంపీ బోర్డులు పెట్టుకుని ఎంబీబీఎస్‌ స్థాయి పరిధి దాటి వైద్యం చేస్తున్న వైద్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎలాంటి అర్హత లేకుండా విచ్చలవిడి గా యాంటీబైటిక్‌, ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular