Monday, September 21, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్బ్యాటరీల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

బ్యాటరీల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

📰 Generate e-Paper Clip

బ్యాటరీల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

 

 

రూ.లక్ష విలువైన 10 బ్యాటరీలు స్వాధీనం

 

 

షోరూమ్‌లో డిస్ప్లే బ్యాటరీలపైనా కన్ను

 

 

కర్నూలు 4వ పట్టణ పోలీసుల చాకచక్యంతో పట్టుబడిన నిందితులు

 

 

కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 18, (సీమకిరణం న్యూస్):

 

చెడు వ్యసనాలకు అలవాటుపడి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బ్యాటరీలను చోరీ చేసిన ఇద్దరు యువకులను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన 10 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసుల వివరాల ప్రకారం.. 

 

కర్నూలు టౌన్‌ లోని శ్రీనివాసనగర్‌కు చెందిన చెంచు వెంకట రాముడు (24), చెంచు వెంకట స్వామి కుమారుడు, అలాగే చెంచు సుంకప్ప (22), చెంచు సుంకప్ప కుమారుడు బ్యాటరీలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. టీవీఎస్ షోరూమ్ ఎదురుగా ఉన్న రంగ బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్స్ దుకాణంలో డిస్ప్లే కోసం ఉంచిన నాలుగు ట్రాక్టర్ బ్యాటరీలు, జెసిబికి చెందిన రెండు కొత్త బ్యాటరీలు, ఆటోకు చెందిన రెండు పాత బ్యాటరీలు, ట్రాక్టర్‌కు చెందిన రెండు కొత్త బ్యాటరీలను వారు చోరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ చేసిన బ్యాటరీలను విక్రయించేందుకు కోడుమూరు రోడ్డులోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉంచినట్లు సమాచారం అందడంతో, కర్నూలు నాలుగో పట్టణ సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ పి. శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న 10 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బ్యాటరీల విలువ సుమారు రూ.1 లక్ష ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular