Monday, August 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు

హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు

📰 Generate e-Paper Clip

హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు

 

కత్తి స్వాధీనం

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 19, (సీమకిరణం న్యూస్) : 

 

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూలు డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో హత్యాయత్నం కేసులో ముద్దాయి ఫయాజ్ బాష @ ఫయాజ్ (29)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తారి వీధిలో ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద ఈ నెల 17న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఫయాజ్ బాష, షేక్ షఫీపై చంపాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో షేక్ షఫీ తలకు బలమైన రక్త గాయం, చేతికి గాయాలయ్యాయి. షేక్ ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.83/2026 U/s 109(1), 79, 351(2) BNS కింద కేసు నమోదు చేశారు. ముద్దాయి కోసం కర్నూలు 1 టౌన్ సీఐ జి. మారుతి శంకర్, ఎస్‌ఐ పి. మహమ్మద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ నెల 18న సాయంత్రం 6 గంటల సమయంలో కర్నూలు టౌన్ పరిధిలోని కల్లూరు దర్వాజా హంద్రీ బ్రిడ్జి వద్ద ఫయాజ్ బాషను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసును సత్వరం ఛేదించిన డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర, సీఐ జి. మారుతి శంకర్, ఎస్‌ఐ పి. మహమ్మద్ అలీ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular