వైకాపా తప్పుడు ప్రచారం.. కర్నూలులో కదం తొక్కిన ఉపాధ్యాయులు
కర్నూలులో కదం తొక్కిన మెగా డీఎస్సీ–2025 టీచర్లు
కడప, అనంతపురం నుంచి భారీగా తరలివచ్చిన మెగా డీఎస్సీ–2025 టీచర్లు
కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 టీచర్లు
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 08, (సీమకిరణం న్యూస్):
వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కడప, అనంతపురం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ర్యాలీగా కదిలారు. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. మెగా డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులపై రాజకీయ దుష్ప్రచారం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

