కర్నూలు క్రైమ్, జూలై 18, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) గోపీనాథ్ పై బదిలీ వేటు పడింది. ఆయనను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపిస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఎస్సై గోపీనాథ్ పై పలు రకాల ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను బాధ్యతల నుంచి తప్పించి వీఆర్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరుపుతున్నారు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు త్వరలోనే కొత్త ఎస్సైని నియమించే అవకాశం ఉందని సమచారం….

