Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పుసులూరు, రేమడూరు గ్రామాల్లో ఎండీఓ జి.ఎన్.ఎస్. రెడ్డి పర్యటన

పుసులూరు, రేమడూరు గ్రామాల్లో ఎండీఓ జి.ఎన్.ఎస్. రెడ్డి పర్యటన

📰 Generate e-Paper Clip

పుసులూరు, రేమడూరు గ్రామాల్లో ఎండీఓ జి.ఎన్.ఎస్. రెడ్డి పర్యటన

 

స్వచ్ఛత, తాగునీరు, అంగన్వాడీ, పెన్షన్లపై ప్రజలకు అవగాహన

 

కల్లూరు, జూలై 08, (సీమకిరణం న్యూస్):

పుసులూరు, రేమడూరు గ్రామాల్లో స్వచ్ఛ రథం, స్వచ్ఛ పదం, ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు మండల అభివృద్ధి అధికారి జి.ఎన్.ఎస్. రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో నగేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లు, అంగన్వాడీ పాఠశాలలు, తాగునీటి సరఫరా, కాలువల నిర్వహణ, నూతన పెన్షన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. గ్రామ ప్రజలకు పలు సూచనలు చేస్తూ, వారి సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకుని సమాధానాలు ఇచ్చారు. గ్రామ పరిశుభ్రతను కాపాడుకోవాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, స్వర్ణ గ్రామ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular