Saturday, June 27, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తి మండల విద్యుత్ ఏఈగా రఘునాథ్

వెల్దుర్తి మండల విద్యుత్ ఏఈగా రఘునాథ్

📰 Generate e-Paper Clip

ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తా : ఆర్. రఘునాథ్

 

నూతన విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. రఘునాథ్

 

వెల్దుర్తి, జూన్ 03, (సీమకిరణం న్యూస్) : 

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) గా ఆర్. రఘునాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఏఈ రాఘవేంద్ర కర్నూలుకు బదిలీ కావడంతో, ఇంచార్జ్ ఏఈగా కల్లూరు వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతిపై రఘునాథ్ వెల్దుర్తి ఏఈగా నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ రఘునాథ్ మాట్లాడుతూ మండల ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యుత్ సమస్యలను వేగవంతంగా పరిష్కరించి, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రఘునాథ్‌కు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది హృదయపూర్వక స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular