Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయం

పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయం

📰 Generate e-Paper Clip

పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయం

 

టిడిపి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్

 

వెల్దుర్తిలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

 

కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మే 27, (సీమకిరణం న్యూస్):

పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయమని వెల్దుర్తి మండల టిడిపి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం వెల్దుర్తిలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు మండల స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో గూడుకట్టుకుందని అన్నారు. ఈనాటి లక్షలాది తెలుగు వారి ఉన్నతికి, సాంకేతిక ప్రగతికి చంద్రబాబు దార్శనికతే కారణమన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనించిందని, నారా లోకేష్ ఆధునిక ఆలోచనలతో కొత్త తరానికి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular