Friday, April 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తాం

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

“బడి పిలుస్తోంది” కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడుల గురించి అవగాహన కల్పించిన కలెక్టర్

 

 

వెల్దుర్తి, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్) :

పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శుక్రవారం “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రం హరిజనవాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.. అనంతరం ఇంటింటికి వెళ్లి విద్యార్థులను, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, వసతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను వంద శాతం బడిలో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటింటికి వెళ్లి, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న సౌకర్యాలను, వివరించి వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ముందుగా 5 వ తరగతి చదవడం పూర్తై 6 వ తరగతి కి వెళ్తున్న విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి రోజూ డిక్షనరీ నుండి కొత్త 5 రకాల ఇంగ్లీష్ పదాలను నేర్చుకోవాలన్నారు. న్యూస్ పేపర్ చదువుకోవాలని, స్టోరీ బుక్స్ చదువుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు బయట తిరగకూడదన్నారు. ఎక్కువ నీరు తాగాలన్నారు.. టీచర్లు విద్యార్థులపై చూపే శ్రద్ధను కలెక్టర్ ప్రశంసిస్తూ, “ఉపాధ్యాయులు ఎంత బాగా కేర్ తీసుకుంటే అంత మంది పిల్లలు పాఠశాలలో చేరుతారని” కలెక్టర్ పేర్కొన్నారు. 5 వ తరగతి పూర్తి చేసిన 41 మంది విద్యార్థులు 100 శాతం సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో 6 వ తరగతి చేరడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ నుండి 1 వ తరగతికి నూతన అడ్మిషన్ తీసుకున్న పిల్లలతో కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లా, మండలం, గ్రామం పేర్లు అడగగా వారు చాలా చక్కగా సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడి సెంటర్ లో ఏ ఏ భోజనాలు పెట్టేవారు అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 42 మంది పిల్లలో, 36 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకున్నారని, మిగిలిన వారు కూడా ఎన్రోల్మెంట్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉన్న పిల్లలు హరిజనవాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేరిన పిల్లలకు కలెక్టర్ తల్లిదండ్రులకు అడ్మిషన్ పత్రాలను అందచేశారు.

 

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్తున్న పాఠాలకు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు సంతృప్తి వ్యక్తం చేసిన తల్లులు

“‘బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రం హరిజనవాడలో వరలక్ష్మి, జస్టిన్, మహేశ్వరి ఇళ్లకు కలెక్టర్ వెళ్ళి ప్రభుత్వ బడుల్లో ఉన్న నాణ్యమైన విద్య, వసతులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, రుచి, శుచికరమైన మధ్యాహ్న భోజనం, యూనిఫార్మ్స్, పుస్తకాలు తదితర వసతులన్నీ కల్పించడం జరుగుతుందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. తల్లులు స్పందిస్తూ తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని, వచ్చే తరగతికి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్ తీసుకున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయని, ఉపాధ్యాయులు చాలా బాగా పాఠాలు చెబుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సుధాకర్, సర్వ శిక్ష అభియాన్ పిఓ లోకరాజ్, ఎమ్ ఈ ఓ పద్మావతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular